అమర్ నాథ్ యాత్రతో కొత్త ఎనర్జీ వచ్చింది త్వరలో రెయిన్‌బో షెడ్యూల్ లో పాల్గొంటా : రష్మిక మందన
ఇటీవలే అమర్ నాథ్ యాత్రను తన కుటుంబంతో దర్శించుకున్న రష్మిక మందన కొత్త ఎనర్జీ వచ్చింది అనే, అంటా శివయ్య మహిమే అని పేర్కొంది. తాజాగా రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు తమిళ ద్విభాషా రోమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ 'రెయిన్‌బో. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు 'రెయిన్‌బో' సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. ఇ. సంగతమిళన్ ఎడిటర్.