రష్మిక మందన నాయికగా రెయిన్బో ప్రారంభం
Dev, rashmika clap by amala
Rashimika, prabhu, suresh babu
నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, భాస్కరన్ సినిమాటోగ్రఫీ.. ఈ రెండూ సినిమాలోఆకర్షణగా వుండబోతున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్ఛార్జ్గా పని చేస్తున్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 'రెయిన్బో' కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. దర్శకుడు దర్శకుడు శాంతరూపన్ అద్భుతమైన కథతో వచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. టీం అందరితో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను అన్నారు
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత.. 'ఒకే ఒక జీవితం' తర్వాత మరో మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. దర్శకుడు శాంతరూపన్ చాలా మంచి కథని రాసుకున్నారు. రష్మిక గారికి కృతజ్ఞతలు. మంచి టెక్నికల్ టీం, సరికొత్త కథాంశంతో రాబోతున్న 'రెయిన్బో' కూడా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం " అన్నారు
దర్శకుడు శాంతరూపన్.. ప్రభు గారు ఒక కథ ఓకే చేస్తే ఎలా వుంటుందో అందరికీ తెలుసు 'రెయిన్బో' అంతే అద్భుతంగా వుంటుంది. ఈ కథని అంగీకరించిన రష్మిక గారికి కృతజ్ఞతలు. టీం అంతా ఎంతో సపోర్ట్ చేస్తోంది. మీకు వండర్ ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి శ్రమిస్తున్నాం అన్నారు.
దేవ్ మోహన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు. నా మొదటి సినిమా శాకుంతులం విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా వుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు గారికి థాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినపుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది అన్నారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7, 2023 నుండి ప్రారంభమవుతుంది.
తారాగణం: రష్మిక మందన, దేవ్ మోహన్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం-శాంతరూబన్
డీవోపీ-కె. ఎం. భాస్కరన్
సంగీతం - జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్ - ఇ. సంగతమిళన్
ప్రొడక్షన్ డిజైనర్- వినీష్ బంగ్లాన్
ఆర్ట్ డైరెక్టర్: సుబెంథర్ పిఎల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగప్రభాకరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్

