మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ఊహించని గెటప్‌లో బాలకృష్ణ హీరోయిన్!

honerose
గతంలో యువరత్న బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలో ఓ హీరోయిన్‌గా నటించిన హనీ రోజ్ ఇపుడు ఊహించని గెటప్‌లో కనిపించారు. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం "రాహేలు"లో ఆమె కసాయి దుకాణంలో పని చేసే యువతిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్‌, మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో ఎవరూ ఊహించని పాత్రలో హనీ రోజ్ నటించి అందరికీ షాకిచ్చింది. ఓ మాంసం దుకాణంలో మాంసం కొడుతున్న లుక్‌ చూసి ప్రతి ఒక్కరూ షాకయ్యారు. మోడ్రన్ దుస్తుల్లో మాంసం కొడుతున్న ఫోటోను హనీరోజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
honerose
 
ఈ పోస్టర్లను చూస్తే ఈ మూవీలో ఆమె చాలా బోల్డ్ పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్నారు.