ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (11:23 IST)

హనీరోజ్‌కు యమా క్రేజ్.. చేదు అనుభవం ఎదురైంది.. (video)

Honey rose
Honey rose
హనీరోజ్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. తొలుత కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు దొరకవేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రెండేళ్ల గ్యాప్ తీసుకుని హనీ రోజ్ బిజీ అయ్యిందుకు అడుగులు వేసింది. 
 
అయితే తెలుగులో ఆమె వీరసింహారెడ్డి సినిమా కంటే ముందు 2008 శివాజీతో ఆలయం అనే ఒక సినిమా చేసింది. కానీ ఆ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియరాలేదు.
 
తెలుగులో కూడా హనీ రోజ్‌కు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఆమెకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. 
 
అయితే ఇటీవల కేరళలో ఊహించిన విధంగా హనీ రోజ్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. 
 
దీంతో ఆమె కింద పడిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఆమె పెద్దగా ఇబ్బంది పడకుండా కారులోకి ఎక్కి ముందు అభిమానులకి అభివాదం తెలుపుతూ సైలెంట్‌గా వెళ్ళిపోయింది.