బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (23:03 IST)

పెళ్లి పీటలెక్కనున్న హనీరోజ్ - వరుడు ఎవరంటే? (video)

honeyrose
సీనియర్ హీరోయిన్లలో ఒకరు హనీరోజ్. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ - గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చి "వీరసింహారెడ్డి" సినిమాతో వెండితెరపై సందడి చేశారు. ఈ ఒక్క సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, ప్రస్తుతం ఈమె పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం. 
 
విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్‌కు వెళ్లిన హనీ.. నటనపై తనకున్న ఆసక్తి పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. వివాహం బంధం బలంగా ఉండటం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేశారు. కేరళ ఆహారం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదని తెలిపారు. అయితే, వరుడు ఎవరు, ఎలా ఉండాలనే విషయాలను మాత్రం పంచుకోలేదు. ప్రస్తుంత హానీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.