గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (15:11 IST)

భర్తను చంపేసిన భార్య.. ప్రియుడిపై మోజుతో జంప్

lovers
అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్‌లో కొత్తగొల్ల తుక్కప్ప, ఈశ్వరమ్మ దంపతులు నివాసముండేవారు. గత కొంతకాలంగా పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ తుక్కప్ప మంచాపడ్డాడు. దీంతో అతడి రెండో భార్య అయిన ఈశ్వరమ్మ అదే కాలనీలో నివాసముండే శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఇలా చాలాకాలంగా సాగుతున్న వారి అక్రమ బంధం ఇటీవలే బయటపడింది. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్న భర్త తుక్కప్పను అంతమొందించాలని ఈశ్వరమ్మ నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలోనే మద్యంలో విషం కలిపి భర్తతో తాగించిన భార్య ప్రియుడితో కలిసి చెక్కేసింది. అపస్మారకస్థితిలో పడివున్న తుక్కప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈశ్వరమ్మతో పాటు ప్రియుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.