శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (20:24 IST)

భారత నయాగరా వద్ద.. పేరెంట్స్ తిట్టారని పాప జంప్!

Chitrakut
Chitrakut
భారత నయాగరా పిలవబడే చిత్రకూట్ జలపాతంలోకి దూకిఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. చిత్రకూట్‌కు చెందిన సరస్వతి మౌర్య (21) నిత్యం సెల్ ఫోన్‌లో ఏదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్న కారణంతో ఆమె తండ్రి శాంటో మౌర్య ఆమెను పరుషమైన మాటలతో దూషించినట్లు తెలుస్తోంది. ఇలా మందలించిన పాపానికి ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు. 
 
కోపంతో సరస్వతి చిత్రకూట్ జలపాతాల వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు ఆమెను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.