శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (19:30 IST)

పాముకాటుకు గురై వ్యాపారి మృతి.. అంతా గర్ల్ ఫ్రెండే చేసింది...

king cobra
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ వ్యాపారి పాముకాటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో 30 ఏళ్ల వ్యాపారవేత్త శవమై కనిపించాడు. 
 
శవపరీక్షలో పాముకాటుతో మృతి చెందినట్లు తేలింది. ఈ స్థితిలో వ్యాపారి సెల్ ఫోన్లను పరిశీలించగా.. మహి అనే మహిళ అతడితో తరచూ మాట్లాడుతున్నట్లు తేలింది. 
 
ఆ మహిళ తరచూ పామును ఆడించే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కూడా గుర్తించారు. దీని తరువాత, పోలీసులు పాము పెంచే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం తేల్చింది. 
 
వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం కలిగివున్న మహిళ, ఆ వ్యక్తి నుంచి పామును కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని తర్వాత యువతి వ్యాపారిని కాటు వేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో యువతి సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వారందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.