గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (12:32 IST)

భార్య ముక్కు కోశాడు.. జేబులో పెట్టుకుని పారిపోయాడు..

crime scene
భార్య ముక్కు కోశాడు.. ఓ భర్త. వివాహేతర సంబంధాలకు అడ్డుగా వున్న భార్య ముక్కు కోసి ఆ భర్త పోరియాడు. ఈ ఘటన యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బన్ స్తలి గ్రామానికి చెందిన విక్రమ్‌కు అదే గ్రామానికి చెందిన సీమా దేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే విక్రమ్‌కు మరో మహిళపై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్తను నిలదీసింది. 
 
దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇలాంటి గొడవ శనివారం కూడా జరిగింది. దీంతో ఆవేశానికి గురైన విక్రమ్., కోపం కూతురిని కొట్టాడు. అయితే భార్య అడ్డుకోవడంతో ఆమె ముక్కును కోసి జేబులో పెట్టుకుని పారిపోయాడు. 
 
రక్తస్రావం అయిన సీమ.. ముక్కుకి క్లాత్ అడ్డం పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. నిందితుడిని వెతికి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. ప్రియురాలి కోసం భార్య ముక్కును కోసిన భర్త వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.