మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (22:49 IST)

మద్యం సేవించి.. కొడవలిని కాల్చి భార్యపై దాడి..

crime news
మద్యం సేవించి, మైకం కమ్మి, విచక్షణ కోల్పోయి ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టి, దాడి చేస్తుంటారు. తాగి.. చిన్న మాటను పట్టుకుని రాద్ధాంతం చేస్తుంటారు. భార్యతో తాగిన మత్తులో గొడవపడి.. ఆపై కొడవలితో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేటలో నివసిస్తున్నారు ఒగ్గు నిర్మల, మల్లేష్ దంపతులు. అయితే మల్లేష్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. 
 
అనంతరం ఇంట్లో ఉన్న కొడవలితో దాడి చేశాడు. దాడి చేసే ముందు కొడవలిని కాల్చి.. నిర్మల మెడ వెనుక భాగంపై పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. 
 
ఆమెను కుటుంబ సభ్యులు కరీం నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.