బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (14:23 IST)

వైరల్ అవుతున్న నిహారిక భర్త పోస్టు.. బాధలో వున్నాడంటూ..

Niharika
మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిహారిక తన భర్తతో విడిపోయినట్లు ఈ మధ్య కాలంలో తరుచుగా ఓ వార్త హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా చైతన్య తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. 
 
నాలుగు నెలల తర్వాత చైతన్య ఓ లాంగ్ పోస్ట్ చేశారు. గత 10 రోజులుగా విపస్సనా యోగను చేయడంతో తన జీవితం ఇప్పుడు కాస్తా ఉల్లాసంగా ఉంటోందని చైతూ అన్నారు. 
 
ఈ సమయంలో అండగా ఉన్నందకు కృతజ్ఞతలు అంటూ రాసుకున్నారు. దీనిని బట్టి ప్రస్తుతం బాధలో ఉన్నట్లు.. ఈ విపాసన యోగ చేయడంతో కాస్తా సంతోషం, హాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిహారికతో విడాకులు నిజమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.