గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (11:29 IST)

రూ.5 లక్షల సుపారీతో భర్తను ఖతం చేసిన భార్య

crime scene
నల్గొండలో రూ.5 లక్షల సుపారీతో భర్తను భార్య చంపించింది. నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. రఘురాములు స్టాంప్ వెండర్‌గా విధులు నిర్వహిస్తూ.. పట్టణంలో విష్ణు కాంప్లెక్స్‌లో కిడ్స్‌వేర్ దుకాణాన్ని ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది.
 
భర్త జల్సాలకు అలవాటుపడి.. అప్పులు చేస్తూ..కుటుంబాన్ని పట్టించుకోలేదు. అంతే దీంతో విసిగిపోయిన భార్య భర్తను హత్య చేయించాలని భావించింది. హైదరాబాద్‌లో నివాసం వుంటున్న స్నేహితురాలి భర్త చిలకరాజు అరుణ్‌తో పరిచయం పెంచుకుని అతని సాయం కోరింది.
 
ఇందుకోసం ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం రఘురాములను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని దేవరకొండ పోలీసులు మీడియాతో తెలియజేశారు.