ప్రియుడితో లేచిపోయిన భార్య... ప్రియుడి ఫోటోకు చెప్పుల దండ వేసిన భర్త
ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఓ సంఘటన జరిగింది. కట్టుకున్న భార్య ప్రియుడితో లేచిపోయింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన భర్త... ప్రియుడి ఫోటోకు చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించాడు. పైగా, తన భార్యను లేపుకెళ్లాడంటూ ఊరిలో చాటింపు కూడా వేయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన అంజి, నేత్రావతి అనే దంపతులు ఉన్నారు. ఈ క్రమంలో నేత్రావతి కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. అదే గ్రామానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి తన భార్యకు మాయమాటలు చెప్పి లేపుకెళ్లాడంటూ అంజి ఆరోపించాడు. దీనికి నిరసనగా దివాకర్ ఫోటోకు చెప్పుల దండ వేసి సైకిల్‌పై ఊరేగించాడు.
తన భార్యను లేపుకెళ్ళాడంటూ ఊరంతా చాటింపు వేశాడు. అలాగే, గ్రామస్థులతో దివాకర్ ఫోటోను చెప్పులతో కొట్టిస్తూ వీధి వీధినా ఊరేగించాడు. అంజి ఆవేదనను వ్యక్తం చేసుకున్న గ్రామస్థులు దివాకర్ ఫోటోపై ఉమ్ముతూ, చెప్పులతో కొడుతూ తమ మద్దతు కూడా తెలిపారు.
కదులుతున్న ఆటోలో మహిళ గొంతుకోసి హత్య
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కదులుతున్న ఆటోలో ఓ వ్యక్తి మహిళను గొంతుకోసి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దీపక్, పంచశీల (30) అనే ఇద్దరు సోమవారం ఓ ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో దీపక్ తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. నిందితుడి బారినుంచి తప్పించుకునేందుకు మహిళ ఆటో దిగి పరుగులు పెట్టినప్పటికీ కొద్ది దూరం వెళ్లాక కిందపడిపోయింది. ఆ తర్వాత అతను కూడా అదే కత్తితో తన గొంతుకు కోసుకున్నాడు.
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, మహిళ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరికీ ముందుగానే పరిచయం ఉందని, ఆటోలో వారి మధ్య గొడవ తలెత్తడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, గొంతు కోయడానికి గల కారణాలు తెలియాల్సివుంది.