శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (14:31 IST)

"మెగా ప్రిన్సెస్"కోసం.. అపోలోకు చేరిన అల్లు అర్జున్ దంపతులు..

Sneha reddy
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య అల్లు స్నేహ రెడ్డితో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌ వెళ్లారు. అక్కడ రామ్ చరణ్, ఉపాసనల బేబీని చూసేందుకు సందర్శించారు. 
 
మంగళవారం తెల్లవారుజామున చెర్రీ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అపోలోకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఆసుపత్రిలో చెర్రీ దంపతులను కలిశారు.
 
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే... మెగా అభిమానులు చెర్రీ-ఉపాసన పాపకు ముద్దుగా "మెగా ప్రిన్సెస్" అని పేరు పెట్టారు. ఈ పేరు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.