శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (11:26 IST)

Priyanka Chopra birthday special: చెర్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు

priyanka chopra
జూలై 18 ప్రియాంక చోప్రా అభిమానులకు పండగే. ఎందుకంటే ఆమెకు ఈ రోజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రో తన భర్త, నిక్ జోనాస్, వారి కుమార్తె మాల్టీ, ఆమె కుటుంబంతో కలిసి తన ప్రత్యేక రోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఆమె చేతిలో పలు సినిమా ప్రాజెక్టులు కూడా వున్నాయి. 
 
బాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. 2002లో తమిళ చిత్రం తమిళన్‌తో నటించడం ప్రారంభించింది. ఆపై బాలీవుడ్‌లో అగ్ర నటిగా మంచి మార్కులు వేసుకుంది. ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై (2003)లో, అందాజ్ (2003), ముజ్సే షాదీ కరోగి (2004) వంటి బాక్సాఫీస్ హిట్‌ సినిమాల్లో నటించింది. 2004 రొమాంటిక్ థ్రిల్లర్ ఐత్రాజ్‌లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 
తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన సిటాడెల్ అనే సిరీస్‌లో కనిపించింది. ఈ ధారావాహికలో రిచర్డ్ మాడెన్‌తో కలిసి కనిపించింది. తాజాగా హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే మరో యాక్షన్ మూవీలో కనిపించనుంది.  
 
ప్రియాంక చోప్రా నటి, చిత్రనిర్మాత, గాయని, నిర్మాత, విజయవంతమైన వ్యాపారవేత్త. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీలలో ఆమె ఒకరు. టైమ్ మ్యాగజైన్ ప్రియాంక చోప్రాను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో పేర్కొంది. 
 
బర్త్‌డే గర్ల్, ప్రియాంక చోప్రా నికర విలువ US $75 మిలియన్లు (సుమారు రూ. 620 కోట్లు). ఆమె ఒక్కో సినిమాకు US $1,33,862.08 (INR 12 కోట్లు) వసూలు చేస్తుంది. హాలీవుడ్‌లో, ఆమె ఒక షోలో పనిచేస్తున్నప్పుడు ఒక్కో ఎపిసోడ్‌కు US $2,43,437 (సుమారు 2 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుంది. ఆమె నెలవారీ జీతం దాదాపు US $1,82,569.95 (INR 1.5 కోట్లు.) వుండవచ్చునని అంచనా. 
 
సినిమాల్లో పనిచేయడమే కాకుండా, నటి సంపాదనలో ఎక్కువ భాగం ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి వస్తుంది. గ్లోబల్ ఐకాన్ ప్రతి ఎండార్స్‌మెంట్‌కు US $6,08,609.50 (సుమారు 5 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుంది. ఆమె గార్నియర్, కోల్‌గేట్, వంటి ఇతర ప్రముఖ బ్రాండ్‌లతో పని చేసింది.
 
అంతర్జాతీయ స్టార్ ముంబైలో రెండు లగ్జరీ హౌస్‌లతో పాటు... లాస్ ఏంజిల్స్‌లోని US $20 మిలియన్ల (సుమారు INR 238 కోట్లు) విలువైన ఇంటిని కూడా కలిగి ఉంది. ఇకపోతే ప్రియాంక చోప్రాకు సెలెబ్రీటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ ప్రియాంకకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ఏడాది ప్రియాంకకు కలిసిరావాలని ఆకాంక్షించాడు.