బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య అరెస్టు

sirisha
మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే (రామకృష్ణ) భార్య శిరీషను శుక్రవారం తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం ఆమె భర్త ఆర్కే చనిపోయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. ఈ జిల్లాలోని టంగుటూరు మండలం ఆలకూరపాడుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆమె అరెస్టును కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని పక్కకు నెట్టేసిన పోలీసులు శిరీషను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు మూడు కార్లలో వచ్చి శిరీషను ఆకస్మికంగా తీసుకెళ్లడం ఇపుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఆర్కే భార్య శిరీష నివాసంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు, ఇతర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు పలుమార్లు సోదాలు జరిపారు.