శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (16:02 IST)

స్పీడ్‌గా వెళ్తున్న బైక్‌పై జంట రొమాన్స్.. వీడియో వైరల్.. పోలీస్ సీరియస్ (video)

Delhi
Delhi
స్పీడ్‌గా వెళ్తున్న బైక్‌పై జంట రొమాన్స్ చేస్తున్న వీడియోపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అయ్యింది. ఢిల్లీ రోడ్డుపై యువ జంట వేగంగా బైక్‌పై రొమాన్స్ చేస్తూ కనిపించారు. జూలై 16న ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగిందని వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. 
 
ఈ వీడియోలో ఇంధన ట్యాంక్‌పై కూర్చున్న మహిళ, తన భాగస్వామికి ఎదురుగా, రైడ్ సమయంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్లు చూపిస్తుంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, చాలా మంది వారి బాధ్యతారాహిత్యమైన, అశ్లీల ప్రవర్తనకు విమర్శిస్తున్నారు. 
 
మరికొందరు ట్విట్టర్ వినియోగదారులు కూడా మహిళ హెల్మెట్ ధరించలేదని ఎత్తి చూపారు, కొందరు వారిని అరెస్టు చేయాలని కోరారు. ఈ క్లిప్‌పై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.