శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (21:29 IST)

సత్య గౌడ్ అదృశ్యం.. ఇంతలో కలకలం రేపుతున్న సూసైడ్ సెల్పీ విడియో

crime photo
సింగరాయిపల్లి మాజీ సర్పంచ్ సత్య గౌడ్ అదృశ్యమయ్యాడు. అయితే ఆయన మృతికి నలుగురు కారణమంటూ తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం కుటుంబ సభ్యులను కలవరపెడుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆందోళనకు గురవుతున్నారు. సత్య గౌడ్‌కు ఏమైవుంటుందోనని భయపడుతున్నారు. 
 
కనిపించకుండా పోయిన సత్యగౌడ్ గ్రామ సర్పంచ్ భర్త అధికం నర్సాగౌడ్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టై ఇటీవల బెయిలుపై విడుదలయ్యాడు. 
 
తాజాగా విడుదలైన సెల్ఫీ వీడియోలో ఇప్పటికే అప్పుల బాధ తాళలేక అర ఎకరం భూమి అమ్ముకున్నానని, ఇప్పుడు డబ్బులు రాకుండా అడ్డుకోవడంతో మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుంటానని పేర్కొన్నాడు. 
 
తాను గ్రామంలో సిసిరోడ్డు పనులు చేశానని, దాని బిల్లుకు సంబంధించిన చెక్కు వచ్చినా తనకు ఇచ్చేవారు కాదని అందులో పేర్కొన్నాడు.