బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (10:16 IST)

ఆటపట్టించారని ముగ్గురి హత్య : భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు

jail
రాత్రిపూట ఇంటి డోర్ బెల్ పదేపదే మోగించి తనను ఆటపట్టించడంతో తీవ్ర ఆగ్రహోద్రుక్తుడైన భారత సంతతికి చెందిన ఓ ముగ్గురు యువకులను కారుతో తొక్కించి చంపేశాడు. ఈ కేసులో నిందితుడుని ముద్దాయిగా తేల్చిన అమెరికా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. పైగా, ఎలాంటి పెరోల్‌కు అవకాశం లేకుండా ఈ శిక్ష విధిస్తున్నట్టు కోర్టుకు తెలిపింది. 
 
ఈ హత్య ఘటన గత 2004లో జరిగింది. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అనురాగ్ చంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు. అలాగే, మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేయగా, ఏప్రిల్ నెలలో విచారణ జరిపిన కోర్టు నిందితుడిని ముద్దాయిగా తేల్చింది. 
 
తాజాగా శిక్షలు ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. రివర్ సైడ్ కౌంటీలోని జ్యూరీకి ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి మూడు గంటల సమయం పట్టినట్టు జిల్లా అటార్నీ కార్యాలయం ఈ నెల 14వ తేదీన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఆరుగురు ప్రయాణిస్తున్న కారును దోషి అనురాగ్ చంద్ర ఉద్దేశ్యపూర్వకంగా ఢీకొట్టి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది.