శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (19:50 IST)

మ్యాగీ నూడుల్స్‌ ప్లేట్‌ రూ.193 : దేవుడా.. ఇంధనంతో మ్యాగీ చేసి వుంటారా?

Noodles
మ్యాగీ నూడుల్స్‌ ఇంటికి తెచ్చుకుంటే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అదే బయట తింటే ఒక ప్లేటు వంద రూపాయల్లోపు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అయితే ఓ మహిళకు విమానాశ్రయంలో ఒక మ్యాగీ కప్ ఆర్డర్ చేసిన పాపానికి కళ్లు బైర్లు కమ్మాయి. 
 
విమానాశ్రయంలో మ్యాగీ ఆర్డర్​ ఇచ్చిన ఆమె.. బిల్లు చూసి షాక్​ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సాజెల్ అనే మహిళ విమానాశ్రయంలో మ్యాగీ ఆర్డర్ చేసింది. దాని ధర రూ.193. ఈ బిల్లు చూసి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. 
 
మ్యాగీని కూడా ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 
 
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం అంటే ఇదేనేమో అని కొంతమంది ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టులో కాబట్టి విమానాలకు వాడే ఇంధనంతో మ్యాగీ చేసి ఉంటారని పలువురు కామెంట్లు పెట్టారు.