గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

దొంగతనం కోసం వెళుతూ మహిళను చంపేసిన దొంగలు... ఎక్కడ?

knife
ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం కోసం బయలుదేరిన ఇద్దరు దొంగలు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళను దారుణం హత్య చేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను చితకబాది.. ఆ ఆటోలో పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడ జిల్లా తుని మండలం, ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై సత్యవతి అనే మహిళ ఒక ఆటోలో ప్రయాణిస్తుంది. అప్పటికే అక్కడకు చేరుకుని మాటు వేసిన ఇద్దరు దొంగలు సడెన్‌గా అడ్డుకుని ఆటోని ఆపారు. ఆపై డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తులైన దొంగలు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. 
 
ఆ తర్వాత ఆటో డ్రైవర్‌పై దాడి చేసి, ఆ ఆటోలోనే పారిపోయారు. తీవ్రగాయాలైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు గుర్తించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఆటో డ్రైవర్‌ నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తుంది. ఈ హత్య వెనుక ఏదైనా కుట్ర దాగివుందా? ఆటో డ్రైవర్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.