శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (10:43 IST)

భర్త కోర్కె తీర్చడానికి వెళితే ఉన్న అందం పోయింది.. ఎలా?

Beauty
దేవుడిచ్చిన అందం సరిపోదని.. కొందరు స్త్రీపురుషులు మరింత అందం కోసం చేసే ప్రయత్నాలు అపుడపుడూ వికటిస్తుంటాయి. తన భర్త కోర్కె తీర్చేందుకు వెళ్లిన ఓ మహిళ ఉన్న అందం పోగొట్టుకుంది. తనను మోడల్‌గా చూసేందుకు కట్టుకున్న భర్త కోరాడు. దీంతో అతని కోర్కె తీర్చేందుకు ఆ మహిళ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో వెలుగు చూసింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మరింత అందంగా కనిపించేందుకు పొడవుగా ఉన్న వెంట్రుకలను కట్ చేయించుకునేందుకు అబిడ్స్ ఏరియాకు వెళ్ళింది. అక్కడి బ్యూటీషియన్ ముందుగా వెంట్రుకలు ఏదో ఆయిల్ పెట్టి హెయిర్ కట్ చేసింది. అయితే, ఆయిల్ పెట్టిన కాసేపటికే జట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. కాసేపటికి తలపై ఉన్న జట్టు మొత్తం రాలిపోవడంతో ఆమె షాక్‌కు గురైంది. 
 
దీంతో ఆమె నెత్తిన పైటకొంగు కప్పుకుని ఇంటికి పరుగులు తీసింది. భార్య నెత్తిన జట్టు లేకపోవడం చూసిన భర్త ఒకింత షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత బాధితురాలు ఊడిపోయిన జట్టును తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తాను హెయిర్ కట్ కోసం వెళ్లిన బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.