మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 జులై 2021 (16:14 IST)

వెబ్ సిరీస్ వ‌ల్లే బోల్డ్ కంటెంట్, చెడు డైలాగ్స్ వ‌చ్చాయిః అరుణ్ ఆదిత్

Dear Megha team
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్లు గా న‌టించిన సినిమా `డియర్ మేఘ‌` .అర్జున్ దాస్యన్ నిర్మాత. సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా  టీజ‌ర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. మేఘా ఆకాష్ టీజర్ ను రిలీజ్ చేశారు.
 
అనంత‌రం ఆమె మాట్లాడుతూ.  సినిమా నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నా పేరుతో వస్తున్న సినిమా కాబట్టి. కొంత గ్యాప్ తర్వాత నేను ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. డైరెక్టర్ సుశాంత్, హీరో అరుణ్ నాపై నమ్మకం ఉంచి, నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని ఆఫర్ చేశారు. తెలుగు సినిమాలు చేయడం ఇష్టం కానీ చాలా కారణాలతో ఇక్కడ ఎక్కువగా చిత్రాలు చేయలేకపోతున్నాను. ''డియర్ మేఘ'' టీమ్ తో పనిచేయడం సంతోషంగా ఉంది. వీళ్లతో కుదిరితే మరో సినిమా చేయాలని ఉంది అన్నారు.
 
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ, వెబ్ సిరీస్ లు వచ్చాక బోల్డ్ కంటెంట్ చూపిస్తున్నారు, చెడ్డ మాట‌లే డైలాగ్స్ అయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైమ్ లో ఓ బ్యూటిఫుల్  లవ్ స్టోరిని ''డియర్ మేఘ'' తో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నా కాలేజ్ డేస్ లో తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మంచి లవ్ స్టోరి సినిమాలు చేసేవారు. అవి మా మనసులో ఉండిపోయాయి. అలాంటి ఒక ప్యూర్ ప్రేమ కథను ''డియర్ మేఘ'' లో చూపించబోతున్నాం. ఇప్పుడంతా ఫాస్ట్ ట్రెండ్ అయిపోయింది. వాట్సాప్  లో ఛాట్ చేసుకోవడం నచ్చకుంటే గుడ్ బై చెప్పడం..కానీ ఇప్పుడు కూడా ప్యూర్ లవ్ ఉంది అని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. తుంగభద్ర నుంచి హరి గౌరతో పనిచేస్తున్నాను. ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆమని ఉంటే పక్కన పాట నా మొత్తం కెరీర్ లో బెస్ట్ సాంగ్. థియేటర్లు తెరవాలని కోరుకున్న చాలా మందిలో నేనూ  ఒకర్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. త్వరలో థియేటర్ రిలీజ్ కు వస్తున్నాం. ''డియర్ మేఘ'' మిమ్మల్ని ఆకట్టుకునే ప్రేమ కథ అవుతుంది. అన్నారు.
 
దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని ప్రేమ కథల్ని మనం థియేటర్లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని లవ్ స్టోరిలు మాత్రం మన మనసులో నాటుకుపోతాయి. హృదయంలో అలాగే నిలిచి ఉంటాయి. అలాంటి సినిమానే ''డియర్ మేఘ''. హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ హార్ట్ ను టచ్ చేస్తుంది. ఆ ఫీల్ తోనే సినిమా చూసి ఇంటికెళ్తారు. మేఘా ఆకాష్ డిడికేషన్ ఉన్న నటి. సినిమా కోసం చాలా కష్టపడింది. ఆమెతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అరుణ్ పదేళ్లుగా నాకు ఫ్రెండ్. తను ఈ సినిమాను ఎంతో ప్రేమించి నటించాడు. అని అన్నారు
 
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, అర్జున్ సోమయాజులు అనే మరో యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఐ ఆండ్రూ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అలాగే హరి గౌర హిట్ మ్యూజిక్ అందించారు. రీసెంట్ గా ఆమని ఉంటే పక్కన అనే పాటను మా సినిమా నుంచి విడుదల చేశాం. ఆ పాటకు వన్ మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. మా చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం అన్నారు.
 
సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడుతూ, ఆమని ఉంటే పక్కన.. పాట వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ అవడం సంతోషంగా ఉంది. నా టెక్నీషియన్స్ అందరి సహకారం వల్లే ఇంత మంచి పాటలు చేయగలిగా. అన్నారు.