శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (17:54 IST)

కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫిల్మ్ 'మ‌ను చ‌రిత్ర' ఫ‌స్ట్ లుక్

Shiva Kandukuri 1st look
శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'మ‌ను చరిత్ర' షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. శివ స‌ర‌స‌న హీరోయిన్లుగా మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శివ కందుకూరి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'మ‌ను చ‌రిత్ర' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గురువారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో ఫెరోషియ‌స్ అవ‌తారంలో క‌నిపిస్తున్నారు శివ‌.

బాగా పెంచిన గ‌డ్డం, నోటిలో సిగ‌రెట్‌తో బైక్ న‌డుపుతున్న ఆయ‌న ఒంటినిండా గాయాలు క‌నిపిస్తున్నాయి. అలా బైక్ నడుపుతూనే కుడిచేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకుని ఉన్నారు శివ‌. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌నే అభిప్రాయాన్ని ఈ పోస్ట‌ర్ క‌లిగిస్తోంది. ఫ‌స్ట్ లుక్‌తోటే శివ ఈ సినిమాపై ఆస‌క్తిని అమితంగా పెంచేశారు.
 
కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో యాపిల్ ట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌. శ్రీ‌నివాస‌రెడ్డి, రాన్‌స‌న్ జోసెఫ్ సంయుక్తంగా 'మ‌ను చ‌రిత్ర‌'ను నిర్మిస్తున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంద‌ని వారు తెలిపారు. గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్స‌వ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.