శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (10:22 IST)

టచ్ చేయకుండానే రూ.లక్షల్లో గుంజేసిన తమిళ నటి శ్రుతి

తెలుగులో ఓ సామెత ఉంది. తొడ చూపించకుండానే రూ.90 వేలు సంపాదించిందన్నది ఆ సామెత. కొందరు అమ్మాయిలు తన శరీర అందాలను ఎరగా చూపి యువకుల నుంచి లక్షలాది రూపాయులను గుంజుతుంటారు.

తెలుగులో ఓ సామెత ఉంది. తొడ చూపించకుండానే రూ.90 వేలు సంపాదించిందన్నది ఆ సామెత. కొందరు అమ్మాయిలు తన శరీర అందాలను ఎరగా చూపి యువకుల నుంచి లక్షలాది రూపాయులను గుంజుతుంటారు. ఈ కోవలో తమిళ నటి శ్రుతి చేరింది. ఈమె తమిళనాట తన అందంతో ధనవంతుల బిడ్డలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేసి, వారి నుంచి లక్షల రూపాయలు గుంజేసింది. 
 
తమను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందని పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని చాలా మంది, ఇప్పుడు పోలీసుల ముందుకు వస్తున్నారు. దీంతో శ్రుతి సెల్ ఫోన్‌లోని కాంటాక్టుల ఆధారంగా విచారణ ప్రారంభించిన అధికారులు, ఒక్కొక్కరి నుంచి ఆమె మోసాలకు సంబంధించిన వివరాలు లాగుతున్నారు. 
 
కోయంబత్తూరుకు చెందిన ఓ ఇంజనీర్ అమెరికాలో ఉండగా, అతనికి పెళ్లి ఆశ పెట్టి రూ.15 లక్షలకు పైగా డబ్బు గుంజిందని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. ఆమె వల్ల మోసగింపబడిన వారి జాబితా చాలా పెద్దదని పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా, శృతిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెల్సిందే.