1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. chiranjeevi kaka update dubbing works started

చిరంజీవి 'కాకా' చిత్రం తాజా అప్‌డేట్స్... ఆ పనులు షురూ

kaka movie
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబ్జీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కాకా'. ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం డబ్బింగ్ పనులను ప్రారంభించారు. చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి కదిరి కాళిదాస్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, కన్నడ నటి రచిత రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మతమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 
 
కాగా, ఈచిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే యేడాది జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ఇప్పటికే ప్రకటించిన విషయంతెల్సిందే. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
D56 Opening: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ లో ధనుష్ 56 చిత్రం మధురైలో ప్రారంభం