లేడీ డెడ్ పుల్ తో రానున్న డెడ్ పుల్, డెడ్ పుల్ & వాల్వరిన్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్
Lady Dead Pull
ఇప్పటివరుకు విడుదలైన ప్రతి వీడియో కంటెంట్ లో ఏదొక స్పెషల్ అప్పీరెన్స్ ను పరిచయం చేస్తూ సినిమాలో డెడ్ పుల్ & వాల్వరిన్ తో పాటు ఇంకా చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారనే హింట్స్ ఇస్తూ వస్తున్న మార్వెల్ టీమ్, తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ లో కూడా అదే పంధా కొనసాగించారు. ఈ ట్రైలర్ లో లేడీ డెడ్ పుల్ అలానే వాల్వరిన్ కూతుర్ని పరిచయం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలును ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ లవర్స్ ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్షన్ ని కూడా చూడబోతున్నారు. డెడ్ పుల్ & వాల్వరిన్ ఇంగ్లీష్ తో పాటు అనేక భాషల్లో విడుదలవ్వనుంది. తెలుగులో డెడ్ పుల్ సిరీస్ కి ఉన్న క్రేజ్ రీత్య డెడ్ పుల్ & వాల్వరిన్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

