డిఫరెంట్ స్పై థ్రిల్లర్ - గ్రే-షూటింగ్ పూర్తి
Pratap Potain, Arvind Krishna and others
చిత్ర దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ, అద్వితీయ మూవీస్ ప్రై.లి పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న `గ్రే` మూవీ షూటింగ్ ఈ రోజు పూర్తయ్యింది. ఇదొక స్టైలిష్ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు టర్నులతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ అన్ని పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. 20రోజుల పాటు నిర్విరామంగా హైదరాబాద్‌లోని పలు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. నిర్మాత కిరణ్‌గారు పూర్తి సహకారం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభంకానున్నాయి. ఔట్‌పుట్ పట్ల మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను`` అన్నారు.
తర్వాతి కథనం
