అద్వితీయ మూవీస్ నిర్మిస్తోన్న గ్రే - ప్రారంభం
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమా `గ్రే`. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ, గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్‌లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి. తెలియని ఎక్స్‌ప్రెషనే గ్రే. అదే స్క్రీన్ పై కనిపిస్తుంది. క్యాస్టింగ్ కోసం చాలా కష్టపడ్డాను. అలీ, అరవింద్, ఊర్వశీ సెట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అన్నారు.
ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, నా ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత నాన్నగారి వ్యాపారంలో నేను పాలు పంచుకున్నాను. ల్యాబ్, థియేటర్స్ వర్క్స్‌లో చురుగ్గా పాల్గొన్నాను. దేశంలోనే ఒక దశలో ప్రసాద్ ప్రొడక్షన్స్ టాప్ ప్రొడక్షన్ సంస్థ. నాన్న గారి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, రమేష్‌ప్రసాద్‌గారు ఇండస్ట్రీకి ఒక బ్యాక్‌బోన్. నేను చేసిన `వాళ్లిద్దరు మధ్య` సినిమాకు కూడా నిర్మాణపరంగా హెల్ప్ చేశారు. గ్రే సినిమాను యూనిక్‌గా చూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు. రాజ్ ముదిరాజుగారు పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఆయన ఇంకా మంచి పేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను. అలీరెజా, అరవింద్ మంచి యాక్టర్స్. అరవింద్‌కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటు న్నాను అన్నారు.
రచయిత లక్ష్మీభూపాల్ మాట్లాడుతూ, తెలుగు సినిమాలు డాక్యూమెంటరీగా వస్తున్నాయి. డ్రామా ఉండటం లేదు. కథలు కొన్నే ఉంటాయి. ఎమోషన్స్ అవే. కానీ ఈ కథ నాకు నచ్చింది. ఎందుకంటే టెక్నిక్ బాగుంది. తెలుగు సినిమా నెక్ట్స్ స్థాయికి వెళ్లాల్సింది టెక్నిక్‌లోనే. ఈ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్** అన్నారు.
నటుడు అలీ రెజా మాట్లాడుతూ - రమేష్‌గారు చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం. రెండు రోజులకు ముందు నేను ఓ క్యారెక్టర్ చేయనున్న సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గ్రే ఓపెనింగ్. మరో రెండు రోజుల్లో తండ్రిని కాబోతున్నాను. అందరి ఆశీస్సుల వల్లే ఇది జరుగుతుంది. రాజ్‌గారితో నేను చేయాల్సిన ఓ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రాజ్‌గారు గ్రే సినిమా చెప్పారు. కథ బాగా నచ్చింది. ఏడాది తర్వాత కూడ నన్ను గుర్తు పెట్టుకుని అవకాశం ఇచ్చిన రాజ్‌గారికి థ్యాంక్స్. అరవింద్, ఉర్వశీలతో యాక్ట్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను అన్నారు.