బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (16:23 IST)

నాకు లైఫ్ ఇచ్చింది షార్ట్ ఫిల్మ్ తీసిన వారేః మధుర వైన్స్ వేడుక‌లో సందీప్ కిష‌న్‌

Mathura Wines prerelease
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు నిర్మిస్తున్న చిత్రం మధుర వైన్స్. `గతం, తిమ్మరుసు` చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ చిత్రానికి అసోసియేట్ అయ్యారు. త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి `అద్భుతం, పంచతంత్రం` చిత్రాలు కూడా రాబోతున్నాయి. ఇక మధుర వైన్స్ సినిమా కి సంబంధించిన ప్రచార చిత్రాలు, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రైలర్స్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా "మధుర వైన్స్"  ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుపుకుంది.
 
ముఖ్య అతిథి హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, పెళ్లికి ముందు మనం ఫంక్షన్ చేసుకుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ సినిమాకు కూడా  టీమ్ అంతా  కష్టపడి కలిసి పని చేసిన తరువాత సినిమా కష్టసుఖాలను పంచుకోవడానికి జరుపుకునే సెలబ్రేషన్స్ వేడుకే "ప్రి రిలీజ్ ఈవెంట్‌. నాకు కాన్ఫిడెంట్ గా మాట్లాడే వారంటే ఏంతో ఇష్టం. ఈ స్టేజ్ పై హీరో, దర్శకులు చాలా కాన్ఫిడెంట్ గా  మాట్లాడారు. వారి మాటలను చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. వీరంతా షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెర కెక్కించారు.అలాగే నాకు లైఫ్ ఇచ్చిన వారంతా కూడా షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన వారే. ఈ చిత్రం తీసిన దర్శక, నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.
 
ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ, జయ కిషోర్ నాకు మంచి మిత్రుడు తను నా కన్నా బాగా రాస్తాడు. నాకన్నా మంచి టాలెంటెడ్ పర్సన్ .ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కల్డ్ ఫిలిం తీసినట్లు అనిపించింది. ఈ సినిమా తనకు పెద్ద హిట్ అయి మంచి విజయం తో పాటు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు.
నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ, సృజన్ నాకు యు.యస్ లో మంచి ఫ్రెండ్, ఈ చిత్రం టైలర్స్, సాంగ్స్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు జయ కిషోర్ మాట్లాడుతూ, 2018 లో షూట్  స్టార్ట్ చేశాము.  2019లోనే ఒక టెక్నీషియన్ దగ్గర ఎనిమిది నెలలు సినిమా ఆగిపోయింది. నేను డైరెక్టర్ అయినా సరే 2019 వరకు ఈ సినిమా లేదు. సృజన్ గారు వీరంతా వచ్చిన తర్వాత ఈ మూవీ కి ఒక షేప్ వచ్చి బయటకు రావడం జరిగింది. అందరూ మా సినిమా కోవిడ్ కారణంగా లేట్ అయ్యింది అంటున్నారు. మా మధుర వైన్స్ కు కోవిడ్ కారణం కాదు అన్ని అడ్డంకులను దాటుకుని అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
 
హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నా. షార్ట్ ఫిలిం తీసే నన్ను అందరూ డిస్కరైజ్ చేస్తే మా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడంతో ఈరోజు నేను ఈ స్టేజి మీద మాట్లాడు తున్నాను. నేను ఈ హీరోగా చేస్తున్నాను అంటే దానికి కారణం నాకు షార్ట్ ఫిలిం లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.