సంబంధిత వార్తలు
- కార్తికేయ 2 సినిమాకు జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి
- శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం
- మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది: నిర్మాత నవీన్ యెర్నేని
- చందూ మొండేటి తో కార్తికేయ3 కు సిద్దమవుతున్న నిఖిల్ సిద్ధార్థ్
- బిచ్చగాడు తర్వాత కంటెంట్ ఉంటే సక్సెస్ చేస్తారనే రికార్డ్ బ్రేక్ తీసా : దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు
ఎర్రచీర దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ
ఎర్రచీర దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతోంది. దీనిని సోషియో ఫాంటసీ జోనర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం టైటిల్ 'పరకామణి'ని విడుదల చేశారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ సి.హెచ్.సుమన్ బాబు తెలిపారు. సుమారు రూ.20 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు.
సృష్టిలో ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తల తల, రసాతల, పాతాళ, భూతల లోకాలను చూపిస్తూ, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో తెరకెక్కే ఈ సోషియో ఫాంటసీ చిత్రం... ప్రేక్షకులకు అధ్భుతమైన అనుభూతిని ఇస్తుందని సుమన్ బాబు తెలిపారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు నటిస్తారని, ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్రచీర డిసెంబర్ 20న విడుదల కానుంది.
