మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 21 డిశెంబరు 2020 (21:29 IST)

హంసానందిని ఏంటీ ఫోజులు? సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?

మిర్చి..మిర్చి..లాంటి కుర్రోడు.. ఈ పాట వింటే ఠక్కున గుర్తుకు వచ్చే హాట్ డ్యాన్సర్ హంసానందిని. ఈమె డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి నటి కూడా. ఎన్నో సినిమాల్లో హాట్ హాట్ గా నటించి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ప్రత్యేక గీతాలతో యువతను ఉర్రూతలూగిస్తోంది.
 
అయితే ఈ మధ్య హంసానందిని మరింత రెచ్చిపోతోంది. కరోనా సమయం కావడం.. అందులోను సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో విదేశాల్లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేస్తోంది హంసానందిని. ఎక్కడికి వెళ్ళిన హాట్ ఫోటో షూట్లతో యువతను కిరాక్ పుట్టిస్తోంది.
 
తన ఫోటోలను స్వయంగా ఆమే సామాజిక మాధ్యమాలే వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. సినిమాలు లేకపోతే కనీసం ప్రేక్షకులు తనను ఎలా గుర్తుపెట్టుకుంటారో.. మర్చిపోతారేమోనన్న ఉద్దేశంతో హంసానందిని ఇలా చేశారేమో గానీ ప్రస్తుతం అయితే ఆమె ఫోటోలు కుర్రకారుకు వేడి పుట్టిస్తోంది.
 
ఆమె ఫోటోలను అదే పనిగా కొంతమంది చూస్తుంటే మరికొంతమంది మాత్రం అమ్మా.. హంసానందిని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి ఫోటోలు పోస్టులు చేస్తున్నావంటూ తిట్టి పోస్తున్నారు. అయితే హంసానందిని మాత్రం విమర్సలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.