హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్‌ని లాంచ్ చేసిన సాయి కుమార్!!

Rushika
ఐవీఆర్| Last Modified గురువారం, 22 అక్టోబరు 2020 (17:03 IST)
హనుమాన్ చాలీసా అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి హనుమాన్ చాలీసాని సింగర్ కం డైరెక్టర్ అద్భుతంగా ఆలపించి నటించారు. హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్‌తో రుషిక హావభావాలు అన్ని హైలెట్ అనేలా ఉన్నాయని...
ఈ హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్ చేసిన సాయి కుమార్ ప్రత్యేకంగా సింగర్ రుషికని మెచ్చుకున్నారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్స్‌తో ఈ సాంగ్‌ని తెరకెక్కించారని.. ఈ పాటని ఆలపించి, డైరెక్ట్ చేసి, నటించిన రుషికాని సాయి కుమార్ అభినందించారు.

రుషిక మాట్లాడుతూ..
మేము హనుమాన్ చాలీసాని ప్రస్తుత తరానికి అర్ధమయ్యే రీతిలో కాస్త వినూత్నంగారాప్ మోడల్ లో చిత్రీకరించటం జరిగింది. లిరిక్స్/సాహిత్యాన్ని మాత్రం మార్చలేదు. పాటచిత్రీకరణలో ఉపయోగించిన చిత్రాలు మరియు ప్రదేశాల అనుమతులు అన్ని తీసుకోవటం జరిగింది. పాట కి సంబందించిన కొన్ని పనుల కోసం పద్మజ హాస్పిటల్ అండ్ స్కిల్టెక్నాలజీస్ వారి సహాయం తీసుకోవటం జరిగింది. ఎలాంటి ఆర్థిక/లాభాపేక్ష లేకుండా కేవలంహనుమాన్ చాలీసాని ప్రజలకు మరింత చేరువ చేయటం కోసం మాత్రమే ఈ పాటని చిత్రీకరించి, విడుదలచేయటం జరిగింది.


ఈ పాట ని ప్రచురించటానికి, ప్రసారం చేయటానికి, టెలివిజన్లు & సోషల్ మీడియాతదితర రంగాలకి ఇత్య టీవీ యాజమాన్యం పూర్తి అనుమతినిస్తుందని తెలియజేస్తున్నాము. దర్శకత్వం/నటన/గాయకురాలు - రుషిక, అలంకరణ - లక్ష్మణ్, చిత్రీకరణ - రుద్ర ఈక్విప్మెంట్స్,చిత్రీకరణ సహాయకులు - విష్ణు వర్ధన్, డి.ఓ.పి/ఎడిటర్ - నవీన్ తొగిటి, ఔట్ డోర్ యూనిట్- ఎస్.ఆర్.లైట్స్, లైట్ ఆఫీసర్ - నాని చౌదరి.




దీనిపై మరింత చదవండి :