1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Jabardasth Hyper Aadi Spoof On Trivikram Srinivas

నాతో ఆయనకు పోలికేంటి... హైపర్ ఆది

Jabardasth Hyper Aadi
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా మంచి పేరుతో పాటు మాటల మాంత్రికుడు అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఆయన తన సినిమాలకు మాటల రచయితగా వేరేవారిని ఎంపిక చేసినట్లు, అందునా అది జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది అనే వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్‌లో అదిరే అభి టీమ్‌లో కంటెస్టెంట్‌గా పరిచయమైన ఆది అనతికాలంలోనే టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. 
 
సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అద్భుతమైన పంచ్ డైలాగ్స్‌తో అతను చేసే స్కిట్‌లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాకు కథ, మాటలు అందించడంతో పాటుగా చిన్న క్యారెక్టర్‌లు కూడా చేశాడు. ఆయనను త్రివిక్రమ్ స్వయంగా పిలిచి మరీ ఈ ఆఫర్ ఇచ్చినట్లు ప్రస్తుతం జోరుగా వార్తలు వస్తున్నాయి.
 
దీనిపై స్పందించిన ఆది "చాలామంది నేను రాసే పంచ్ డైలాగ్‌లు విని నన్ను త్రివిక్రమ్ గారితో పోలుస్తుంటారు. అయినా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నన్ను ఎందుకు పిలుస్తాడండీ.. అదంతా ఫేక్ న్యూస్. నేను ఆయన మీదున్న అభిమానంతో రెండు మూడు సార్లు కలిశానంతే. ఆయన సినిమాకు మాటలు రాయమని నన్నెప్పుడూ పిలవలేదు. ఏదేమైనా ఆయనలాంటి వారితో నన్ను పోల్చడం మాత్రం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.
About Writer
ప్రీతి
తర్వాతి కథనం
తెలుగు 'విశ్వాసం' చిత్రం విడుదుల తేదీ ఖరారు..!