శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 19 సెప్టెంబరు 2018 (20:47 IST)

బాలీవుడ్‌లో శ్రీదేవి కూతురు జాహ్నవి హాట్ భామగా క్రేజ్

కత్రినా కైఫ్‌లా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు కాలేదు. దీపికా పదుగునెలా స్టార్‌డమ్ హిట్స్‌తో పేరును సంపాదించనూ లేదు. ప్రియాంకా చోప్రాలా లవ్ ఎఫైర్‌తో న్యూస్‌లో లేదు. అయినా వీళ్ళకు పోటీగా క్రేజ్ సంపాదించడం ఎలాగో శ్రీదేవి కూతురు జాహ్నవికి బాగా తెలుసినట్లుంది

కత్రినా కైఫ్‌లా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు కాలేదు. దీపికా పదుగునెలా స్టార్‌డమ్ హిట్స్‌తో పేరును సంపాదించనూ లేదు. ప్రియాంకా చోప్రాలా లవ్ ఎఫైర్‌తో న్యూస్‌లో లేదు. అయినా వీళ్ళకు పోటీగా క్రేజ్ సంపాదించడం ఎలాగో శ్రీదేవి కూతురు జాహ్నవికి బాగా తెలుసినట్లుంది.
 
జాహ్నవి సినిమా ఎంట్రీ అదిరింది. హీరోయిన్‌గా తొలి అడుగులోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ మూవీ సినిమాలో నటిస్తోంది. దీని తరువాత ఒక బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుస ఆఫర్లతో బిజీ అవుతూనే మరోవైపు గ్లామర్ పోస్ట్‌తో బాలీవుడ్ న్యూస్ ఐటమ్ అయిపోయింది జాహ్నవి. జాహ్నవి ప్రెస్ మీట్లు, ఫంక్షన్లలో కనిపిస్తే చాలు కెమెరా కళ్ళన్నీ ఈమెపైకే వెళ్ళిపోతున్నాయి.
 
చిట్టిపొట్టి డ్రస్సులతో ఒయ్యారాలను ఒలకపోస్తూ అందరినీ మైమరపిస్తోంది. రీసెంట్‌గా ఈ అమ్మడు వేసిన డ్రస్సులు, ఫోటోల కోసం నెట్లో ప్రేక్షకులు తెగ వెతికేస్తున్నారట. పట్టుమని పది సినిమాలు చేయకముందే హాట్ భామగా బాగా పేరు సంపాదించింది జాహ్నవి. ఈమె హాట్ ఫోటోలతో బాలీవుడ్లో అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోతోందట జాహ్నవి. ఇది కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.