సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (17:20 IST)

నడుము నొప్పితో షూటింగ్ పూర్తి చేసి.. లిఫ్ట్ ఎక్కితే?: రాధికా ఆప్టే

బోల్డ్‌గా మాట్లాడటంలో ముందుండే రాధికా ఆప్టే.. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌పై ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన రాధికా ఆప్టే ఇండస్ట్రీలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌పై సెన్

బోల్డ్‌గా మాట్లాడటంలో ముందుండే రాధికా ఆప్టే.. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌పై ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన రాధికా ఆప్టే ఇండస్ట్రీలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. హాలీవుడ్‌లో ఉధృతంగా సాగుతున్న మీటూ ఉద్యమంపై బాలీవుడ్ నటీమణులు ఎందుకు స్పందించట్లేదని రాధిక ప్రశ్నించింది. 
 
ఇంకా తనకు బాలీవుడ్‌లో ఎదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్‌లో తనకు నడుము నొప్పి వచ్చిందని.. అయినా భరించి.. ఆ రోజు షూటింగ్ పూర్తి చేశానని చెప్పింది. షూటింగ్ పూర్తయ్యాక రూమ్‌కి కదిలాను. అదే సినిమాలో నటిస్తోన్న మరో నటుడు లిఫ్ట్‌లో తనతో పాటు ఎక్కాడు. ఏదైనా సహాయం కావాలంటే చెప్పు. 
 
ఇంకా అర్థరాత్రి అయినా వచ్చి నడుము మసాజ్ చేస్తానని అభ్యంతరకరంగా మాట్లాడాడని రాధికా ఆప్టే వ్యాఖ్యానించింది. ఆ విషయాన్ని సినిమా యూనిట్‌కి చెప్పడంతో పెద్దలు అతడిని మందలించి తనకు సారీ చెప్పించారంటూ రాధిక వెల్లడించింది. ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.