శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (10:58 IST)

స్వీట్ స‌ర్‌ప్రైజ్ - ఎన్టీఆర్ మూవీలో మెగాస్టార్.!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్న‌పూర్ణ స్టూడియోలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్న‌పూర్ణ స్టూడియోలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ద‌స‌రా కానుక‌గా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలావుంటే... ఈ సినిమాలో స్వీట్ స‌ర్‌ఫ్రైజ్ ఒక‌టి ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అదే... ఈ మూవీలో మెగాస్టార్ న‌టించార‌ని. మెగాస్టార్ అంటే టాలీవుడ్ మెగాస్టార్ కాదండోయ్. బాలీవుడ్ మెగాస్టార్. అవును బిగ్ బి అమితాబ్ న‌టించార‌ని టాక్ వినిపిస్తోంది. నాగార్జున ఫ్యామిలీ క‌లిసి న‌టించిన మ‌నం సినిమాలో అమితాబ్ ఓ గెస్ట్ రోల్ క‌నిపించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చిరంజీవి సైరా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌లో అతిథి పాత్ర పోషించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే క‌నుక నిజ‌మైతే... నిజంగా స్వీట్ స‌ర్‌ప్రైజే.