శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (11:45 IST)

మరోమారు ముఖానికి రంగేసుకోనున్న పవర్ స్టార్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు ముఖానికి రంగేసుకోనున్నారు. అదీ కూడా 2019 ఎన్నికలకు ముందే ఆయన ఓ చిత్రంలో నటించి, విడుదల చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చురుగ్గాసాగుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు ముఖానికి రంగేసుకోనున్నారు. అదీ కూడా 2019 ఎన్నికలకు ముందే ఆయన ఓ చిత్రంలో నటించి, విడుదల చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చురుగ్గాసాగుతున్నాయి. 
 
నిజానికి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో నటించింది కేవలం 25 సినిమాలు మాత్రమే. కానీ, కోట్లాది మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. అయితే ప్ర‌జ‌ల‌కి సేవ చేయాల‌నే ఉద్దేశంతో రాజకీయాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'అజ్ఞాత‌వాసి' చిత్రం త‌ర్వాత సినిమాలు చేయ‌డం మానేశాడు.
 
కానీ, ఆయన అభిమానులు మాత్రం పవన్‌ను వెండితెరపై చూడాలని ఆత్రుతతగా ఎదురు చూస్తున్నారు. అయితే, అది ఇప్పట్లో కుదిరేలా లేదని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ, అభిమానుల చెవికి ఓ శుభ‌వార్త వినిపించింది. ప‌వ‌న్ మ‌ళ్ళీ మేక‌ప్ వేసుకోనున్నాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గుతుంది. దీంతో ప‌వ‌న్ ఎప్పుడు ఎవరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు 
 
మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ త్వ‌ర‌లో తెలుగు తెర‌పై మెర‌వ‌నున్నాడ‌ని, ఈ క్ర‌మంలో ఆయ‌న న‌ట‌న‌తో పాటు వివిధ రంగాల‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వైష్ణ‌వ్ తేజ్ చిత్రాన్ని 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' చిత్రాల దర్శకుడు డాలీ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని అన్నారు. 
 
ప‌వ‌న్ మేన‌ల్లుడు సినిమాని డైరెక్ట్ చేస్తున్న డాలికి ప‌వ‌న్‌తోనూ మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేయ‌మ‌ని ప‌వ‌ర్ స్టార్‌ని కోరాడ‌ట‌. మేన‌ల్లుడి కోసం ప‌వ‌న్ వారి అభ్య‌ర్ధ‌న‌ని అంగీక‌రించార‌ట‌. అంటే త్వ‌ర‌లో ప‌వ‌న్ వెండితెర‌పై మెరిసి మురిపించున్న‌డ‌న్న‌మాట‌. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.