1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Janasena membership | Pawan Kalyan

థియేటర్ వద్ద చేసే సందడిలాగానే గ్రామాల్లో చేయండి.. జనసేన సైనికులకు పవన్ పిలుపు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక సందడి మొదలైంది. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల కంటే ముందుగానే అసెంబ్లీ రద్దు అయింది. దీంతో రాష్ట్ర అసెంబ్లీకి ఒకటిరెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో

Janasena membership
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక సందడి మొదలైంది. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల కంటే ముందుగానే అసెంబ్లీ రద్దు అయింది. దీంతో రాష్ట్ర అసెంబ్లీకి ఒకటిరెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
 
నిజమైన జనసైనికులు సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైందంటూ పిలుపునిచ్చారు. సినిమా రిలీజ్‌ అయితే థియేటర్‌ వద్ద చేసిన సంబరాల మాదిరిగానే ఇప్పుడు గ్రామ గ్రామానా సభ్యత్వ నమోదుతో సందడి చేయాలని కోరారు. సినిమా థియేటర్లను అలంకరించేబదులుగా ఆయా గ్రామాలు, నగరాల్లో జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని అభిమానులను కోరారు. ఈ నెల 9 లోపు ఒక్కొక్కరు వంద సభ్యత్వాలు చేర్పించడంతో పాటు పది మంది కలిసి జెండా దిమ్మలు ఏర్పాటు చేసి పవన్‌ అభిమానుల సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మొగుడి వద్దకు వెళ్లేందుకు సెలవిస్తా .. కానీ 3 నెలలకోసారి వచ్చి కోరిక తీర్చి వెళ్లు...