సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (18:39 IST)

శోభనం గది నుంచి అర్థరాత్రి పారిపోయిన పెళ్లి కొడుకులా ఉంది...

నిర్ణీత గడువు కంటే 8 నెలల 26 రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కమిటీ సభ్య

నిర్ణీత గడువు కంటే 8 నెలల 26 రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణలు విమర్శలు చేశారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే శోభనం గది నుంచి అర్థరాత్రి పారిపోయిన పెళ్లికొడుకు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు. కేసీఆర్‌ వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి.. సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రతిపక్ష నేతలను సన్నాసులు, దద్దమ్మలు అంటూ నీచంగా మాట్లాడే కుసంస్కారి కేసీఆర్‌ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. 'ఎన్నికల కమిషన్‌ను నిర్దేశించేలా కేసీఆర్‌ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ని కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. 
 
స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తేదీలను కేసీఆర్‌ ప్రకటించడంపై మేం ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ది కుటుంబ క్యాబినేట్‌. చర్చ లేకుండా రెండు నిమిషాల్లో అసెంబ్లీకి రద్దు చేస్తూ క్యాబినేట్‌ తీర్మానం చేశారు.