మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (12:09 IST)

స్వలింగ వివాహాల అనుమతికి కేంద్రం నిరాకరణ

స్వలింగ వివాహాల అనుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా కనిపించడం లేదు. స్వలింగ సంపర్కానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. వివాహాలకు మాత్రం అనుమతి ఇవ్వరాదన్న నిర్ణయంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తో

స్వలింగ వివాహాల అనుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా కనిపించడం లేదు. స్వలింగ సంపర్కానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. వివాహాలకు మాత్రం అనుమతి ఇవ్వరాదన్న నిర్ణయంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇటీవలే స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం పోరుసాగిస్తామని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ) వర్గాల ప్రతినిధులు ప్రకటించారు. 
 
సెక్షన్ 377 భవితవ్యాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసిన కేంద్రం... స్వలింగ వివాహానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు స్వలింగ మేజర్లు పరస్పర అంగీకార శృంగారంలో పాల్గొనడం నేరం కాదంటే ఒప్పుకుంటాం. కానీ స్వలింగ వివాహాల చట్టబద్ధానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించబోదు అని కేంద్రంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 
 
అధికార బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శకత్వాన్ని అందించే ఆర్‌ఎస్‌ఎస్ కూడా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్వలింగ వివాహాలు ప్రకృతి నియమాలకు వ్యతిరేకం. వాటిని మేం అంగీకరించం అని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి అరుణ్‌ కుమార్ పేర్కొన్నారు.