Kaka Latest Update: బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా.. కాకీ.. కాంబినేషన్ ఎంట్రీ
Chiranjeevi, Vijayasanthi
నేడు ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది. అక్కడ పారడైజ్ చిత్రం కోసం వేసిన సెట్లో సినిమాలో మోహన్ బాబు హౌస్ గా చిత్రీకరంచారు. అందులో రామ్ లక్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఆధ్వర్యంలో చిరంజీవి, విజయశాంతి పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. ఇందులో పోలీసు అధికారిగా నటించనున్నట్లు సమాచారం. ఇక ఇందులో విలన్ గా అనురాగ్ కాశ్యప్ నటిస్తున్నారు.
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ మార్కెట్ రీత్యా మంరిత హైప్ రాబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కాకా. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది.
ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.
కాకా 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

