నా పెర్‌ఫార్మెన్స్ చూడండంటున్న హిమజ
Himaja
జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ జ. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైలర్‌ను సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది.
దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ, `జ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది అన్నారు.
