కాఫీ అంత ప్లజంట్‌గా వుంటుంది నా పాత్ర - కృతిశెట్టి
Kriti Shetty,
ఈ చిత్రం నుండి కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్‌గా కనిపించింది కృతి. ఆమె కూల్ గా కాఫీ ఆస్వాదించడం ప్లజంట్ గా వుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. నా పాత్ర కాఫీ అంత ప్లజెంట్‌గా వుంటుందని చెబుతోంది.
ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా మరో కథానాయికగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.
