స్టూడియో గ్రీన్ కాంబినేషన్లో రూపొందుతున్న మిస్టీరియస్ థ్రిల్లర్ శివోహం
Shivoham poster
మిస్టీరియస్ సాగా గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎవరికీ అంతుచిక్కని నిధి, ఓ డెవిల్కి మధ్య నడిచే యుద్ధం అని మేకర్స్ ప్రకటించటమే కాకుండా అందరిలోనూ క్యూరియాసిటీని కలిగించే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివోహం పోస్టర్‌ను గమనిస్తే గుడి ద్వారం మూసి వేయడింది. దాని ముందు ఓ త్రిశూలం కనిపిస్తోంది. అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. ఇది ఆడియెన్స్‌లో తెలియని ఓ ఆసక్తిని కలిగిస్తోంది. కచ్చితంగా ఎవరికీ తెలియని రహస్యమేదో ఉందనే ఆలోచన కలుగుతుంది.
డైరెక్టర్ రమేష్ వర్మ పెన్మత్సగారు దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియోగ్రీన్ వంటి ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టార్స్ హీరోలతో భారీ బడ్జెట్, మంచి క్వాలిటీ మూవీస్‌ను చేయటంలో స్టూడియో గ్రీన్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఇదే సంస్థ నుంచి ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ రూపొందుతుండటం అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది.
కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సంతోష్ డెటాకె సినిమాటోగ్రఫీ అందిస్తోన్నశివోహం చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.

