పాప్ కార్న్ నుంచి సాంగ్ రిలీజ్ చేసిన నాగ చైతన్య
Avika Gor, Sai Ronak
పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో మది విహంగమయ్యే.. పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా చక్కగా ఆలపించారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ పాప్ కార్న్ మూవీని ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్దలకు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వస్తుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ మురళి గంధం టేకింగ్‌ను అందరూ తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు అన్నారు.
సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ డిఫరెంట్ మూవీ . డైరెక్టర్ మురళిగారు నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం అన్నారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు సినిమాలోకి లీనమైపోతారు. ఇక చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మూవీ అలరిస్తుంది అన్నారు.
