బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (16:00 IST)

అవికా గోర్ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌ : పాప్ కార్న్ ట్రైల‌ర్ రిలీజ్ లో అక్కినేని నాగార్జున‌

Avika Gore, Nagarjuna, Sai Ronak, MS Chalapathy Raju and others
Avika Gore, Nagarjuna, Sai Ronak, MS Chalapathy Raju and others
అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. బుధ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ లీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున విచ్చేశారు. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ,  లిఫ్ట్ లో సాంగ్ కొరియోగ్ర‌ఫీ చేసిన అజ‌య్‌కి అభినంద‌న‌లు. సినిమాను చ‌క్కా చేశాడు.  డైరెక్ట‌ర్ ముర‌ళి టెన్ష‌న్ ప‌డ‌న‌క్క‌ర్లేదు. సినిమా డిఫ‌రెంట్‌గా ఉంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. అలాగే హీరో సాయిరోన‌క్‌కి ఆల్ ది బెస్ట్‌. నేను ప‌దేళ్ల ముందు బ్రెజిల్‌లో రియో సిటీకి ఓ స్టూడియో చూద్దామ‌ని వెళ్లాను. అక్క‌డ అవికాగోర్ ముఖాన్ని చూశాను. చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌ను స్పానిష్‌లోనూ డ‌బ్ చేసుకున్నారు. అడిగితే అక్క‌డ సూప‌ర్ డూప‌ర్ హిట్ సీరియ‌ల్ అని చెప్పారు. ఈ అమ్మాయిని మెచ్చుకుంటూ చాలా విష‌యాల‌ను అడిగారు. త‌ర్వాత 128 దేశాల్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌ను డ‌బ్ చేశార‌ని తెలిసింది. అవికా గోర్ ఎప్పుడో పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌. క‌జికిస్థాన్‌లోనూ రెండు సినిమాలు చేసింది. మేం మా టీవీలో పార్ట్‌న‌ర్స్‌గా ఉన్న‌ప్పుడు అందులో ప్ర‌సార‌మైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ టాప్‌గా నిలిచింది. అప్పుడు నాకు అవికా గోర్ ప‌రిచ‌యం. దాని త‌ర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాను రామ్మోహ‌న్‌గారితో క‌లిసి నిర్మించాం. ఇప్పుడు లిఫ్ట్‌లో పాట‌, అవికా ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎన‌ర్జీ మామూలుగా లేదు. అవికా గోర్ హీరోయిన్‌గానే కాదు, నిర్మాత కూడా అయ్యింది. డిఫ‌రెంట్ సినిమాలను ఆడియెన్స్ బాగా ఆద‌రిస్తున్నారు. అలాగే ఈ పాప్ కార్న్ సినిమాను పెద్ద హిట్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ.. అవికాగోర్‌గారు ఈ సినిమాను ముందుండి న‌డిపించింది. సినిమాను ఇష్ట‌ప‌డి చేశాం. పొలిమేర సినిమాలో ఎలా ఉంటుందో దాన్ని మించి రెండు వంద‌ల శాతం సినిమా బావుంటుంది. సినిమా చివ‌రి 45 నిమిషాలైతే అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది. పెద్ద‌వాళ్లంద‌రూ మ‌ళ్లీ వెన‌క్కి వెళ‌తారు. చిన్న‌వాళ్లైతే ఎంజాయ్ చేస్తారు. ప్యూర్ ల‌వ్ స్టోరి. అందుకే వాలెంటైన్స్ డే కంటే ముందే రిలీజ్ చేస్తున్నాం అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌క‌డు ముర‌ళి గంధం మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా తొలి చిత్రం. మా పాప్ కార్న్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి టీమ్‌ను స‌పోర్ట్ చేసిన నాగార్జున‌గారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. అలాగే అవికా గోర్‌, సాయి రోన‌క్‌.. గారికి, నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్‌’’ అన్నారు. 
 
నిర్మాత, హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ ‘‘తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభ‌మైంది. ఆ సినిమాలో నాగార్జున‌గారితో ప‌రిచయం ఏర్ప‌డింది. నాకు, రాజ్ త‌రుణ్‌కి తొలి సినిమా. అయితే మా కాన్ఫిడెన్స్ ఎక్క‌డా దెబ్బ తిన‌కూడ‌ద‌ని ఆయ‌న ఎప్పుడూ మా వెంటే ఉండేవారు. మంచి నిర్మాతే కాదు.. మంచి మ‌నిషి కూడా. మా సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌చ్చినందుకు ఆయ‌నకు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. పాప్‌కార్న్ సినిమా విష‌యానికి వ‌స్తే నేను చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ సినిమాకు నిర్మాత‌గా చేయ‌టం రిస్క్ అని అన్నారు. కానీ నేను ఆ రిస్క్ తీసుకోవ‌టం ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఈ రిస్క్ తీసుకోవ‌టానికి స‌పోర్ట్ చేసిన నా త‌ల్లిదండ్రుల‌కు థాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కులు నేను చేసిన ప్ర‌తి సినిమాకు అప‌రిమిత‌మైన ప్రేమాభిమానాల‌ను అందించారు. వారిచ్చిన ఆశీర్వాదాల‌తోనే నాకు ఏదైనా కొత్త‌గా చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ డిఫ‌రెంట్, టెక్నిక‌ల్‌గా ఛాలెంజింగ్ మూవీ. లిఫ్ట్‌లోనే యాక్టింగ్‌, పాట‌లు అన్నీ చేయాలి. ఇంత‌కు ముందు నేను చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైంది’’ అన్నారు. 
 
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘‘నాగార్జున నేనెంతో ఇష్ట‌ప‌డే హీరో. ఆయ‌న ఈరోజు మా పాప్ కార్న్ మూవీ ట్రైల‌ర్ ఈవెంట్‌కి రావ‌టం హ్యాపీగా ఉంది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల లోపే ఆడియెన్స్ పాప్ కార్న్ ప్ర‌పంచంలోకి వ‌చ్చేస్తారు. లిఫ్ట్‌లో న‌డిచే క‌థ క‌దా.. బోర్ అయిపోతామేమో అని అనుకున్నాను. కానీ ముర‌ళిగారు క‌థ‌ను నెరేట్ చేయ‌టం స్టార్ట్ చేయ‌గానే ఎక్క‌డా బోర్ ఫీల్ కాలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌న‌యితే ప్రేక్ష‌కులు సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూస్తారు. చేసిన నాకే సినిమా చూస్తే గూజ్‌బమ్స్ వ‌చ్చాయి. ఎక్క‌డా ల్యాగ్ అనిపించ‌దు అన్నారు.