సంబంధిత వార్తలు
- మరిచిపోయిన విద్యను లక్ష్యతో చెబుతున్నాం- ఈసారి లాక్డౌన్ వస్తే పెండ్లి చేసుకుంటా - నాగశౌర్య
- నా మాటలు విని ఆయన నవ్వడం అతి పెద్ద ప్రశంసః గణేష్ రావూరి
- మా నమ్మకం నిజమైంది - నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరంః నాగశౌర్య
- పర్వాలేదు అనిపించే వరుడు కావలెను
- త్రివిక్రమ్ ఓ సీన్ రాశారు - ఆమె పాత్రతో ప్రేమలో పడిపోయా - నాగశౌర్య
నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా నాగశౌర్య|
Nagashourya,
నాగ శౌర్య పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కృష్ణ వ్రింద విహారి అనే ఈ టైటిల్ ఎంతో ట్రెడిషనల్‌గా, కొత్తగా ఉంది. కృష్ణ, వ్రింద అనేవి హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు అని తెలుస్తోంది. టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది.
ఈ పోస్టర్‌లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నారు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించారు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. మొత్తానికి పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇప్పటివరకు నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు.
ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి కమెడియన్స్ ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. వారి క్యారెక్టర్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి.
శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు, సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక బృందం
దర్శకుడు: అనిష్ ఆర్ కృష్ణ
నిర్మాత: ఉషా మూల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ మూల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర్
డీఓపీ: సాయి శ్రీరామ్
కో ప్రొడ్యూసర్: బుజ్జి
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్
తర్వాతి కథనం
