సంబంధిత వార్తలు
- ప్రధానిని ప్రశ్నించకుండా బాబును తిడతారెందుకు పవన్-జగన్?
- ముద్దులు పెట్టడానికి రాలేదు - వారిద్దరూ అన్న - పెదనాన్నలు కాదు : పవన్ కళ్యాణ్
- ప్రత్యేక హోదాపై ఎద్దేవా చేస్తారా? మోదీగారూ తీరు మార్చుకోండి..
- దక్షిణాదిలో బీజేపీకి సున్నా.. కానీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే...
- ఎన్సీపీని శరద్ పవార్ నడిపించడం లేదు.. మునాఫ్ హకీ రిజైన్
ఇదిగోండి.. మోదీ డూప్ మంచూరియా తయారు చేస్తున్నాడు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డూప్ వచ్చేశాడు. అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో షేర్ చేశాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డూప్ వచ్చేశాడు. అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలోని వ్యక్తి వివరాలను వెల్లడిస్తే లక్ష రూపాయల నజరానా కూడా ప్రకటించాడు ఆర్జీవీ. దీంతో నెట్టింట అతని కోసం వెతికే వారి సంఖ్య ఎక్కువైంది.
ఏపీ సీఎం చంద్రబాబు మాదిరే వున్న వ్యక్తిని చూసి అందరూ షాకయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే.. ప్రధాని మోదీ వంతు వచ్చింది. అచ్చం ఆయన మోదీ తరహాలోనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోదీని పోలిన వ్యక్తి టీ షర్ట్ ధరించి.. మంచూరియా తయారు చేస్తున్నాడు. ఆ ఫోటోను మీరూ చూడొచ్చు.
