సంబంధిత వార్తలు
- చంద్రబాబు - కేసీఆర్‌లకు ఉన్న తేడా అదే : జేసీ దివాకర్ రెడ్డి
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. బిడ్డ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి...
- పార్కులో కాదు.. గుడిలోనే ఆ ప్రేమ జంట కామకాలాపాలు.. చివరికి?
- తనూశ్రీకి 'నానా' వేధింపులు... 'పటేకర్'లో చీకటి కోణం ఉంది : డింపుల్
- దక్షిణాదిలో బీజేపీకి సున్నా.. కానీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే...
ప్రత్యేక హోదాపై ఎద్దేవా చేస్తారా? మోదీగారూ తీరు మార్చుకోండి..
ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి అలా మాట్లాడిన ప్రధాని దేశ రక్షణకు అంత్యంత కీలకమైన అంశాలపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. రాఫెల్ డీల్‌పై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీశారు.
స్వచ్ఛ భారత్ పేరుతో తెరవెనుక బ్యాంకులను ఊడ్చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ అమలుతో నష్టపోయిన చిరు వ్యాపారులను ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మోదీ తీరు చూస్తుంటే.. ఆయన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశానికి ప్రధాని కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారిని సురక్షితంగా దేశం దాటిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మోదీ మౌనం వీడాలని కోరారు.
